Friday, November 22, 2024

ఒకే దేశం-ఒకే రేషన్ స్కీమ్ అమలుకు సుప్రీం గడువు

- Advertisement -
- Advertisement -
Supreme Court deadline one nation one ration scheme
జులై 31 నాటికి అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆదేశం

న్యూఢిల్లీ : జులై 31నాటికి అన్ని రాష్ట్రాలు, ఒకేదేశం ఒకే రేషన్ కార్డు (వన్‌నేషన్, వన్ రేషన్ కార్డు) స్కీమ్‌ను అమలు చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం కేంద్రానికి గడువు విధించింది. ఈ విధానం ద్వారా దేశంలో ఏ రాష్ట్రం లోనైనా రేషన్ కార్డు ఉన్న వ్యక్తి స్థానికంగా సబ్సిడీ ఆహార ధాన్యాలు తీసుకునే వీలు ఉంటుంది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వం లోని ధర్మాసనం కేంద్రానికి కూడా ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. వలస కార్మికులు, అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్ కోసం ఓ జాతీయ వెబ్‌సైట్‌ను రూపొందించాలని, జులై 31 లోగా ఆ పోర్టల్ అందుబాటు లోకి రావాలని సూచించింది. అన్ని రాష్ట్రాల వలస కార్మికులకు రేషన్ జారీ చేయాలని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కమ్యూనిటీ కిచెన్‌లను నిర్వహించాలని, కొవిడ్ మహమ్మారి వేళ ఎవరూ ఆకలితో ఉండకుండా చూడాలని కోర్టు పేర్కొంది.

ఈ సందర్భంగా రైట్ టు ఫుడ్ అనేది ప్రాథమిక హక్కు అని కోర్టు తన తీర్పులో గుర్తు చేసింది. ఆత్మ నిర్బర్ స్కీమ్ కింద వలస కూలీలకు ఆహారాన్ని ఏర్పాటు చేయలేక పోయినట్టు ఓ పిటిషన్‌లో అడ్వకేట్ ప్రశాంత్‌భూషణ్ ఆరోపించారు. ఆహార భద్రత అన్నది పోర్టబుల్‌గా మారిందని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యబాటి మంగళవారం కోర్టుకు వెల్లడించారు.వన్‌నేషన్ వన్‌రేషన్ కార్డుతో ఇది సాధ్యమైందన్నారు. వలస కూలీల కోసం ఈ స్కీమ్‌ను విజయవంతంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. దేశంలో ఉన్న అన్ని చౌకధర దుకాణాల నుంచి రేషన్ కార్డుతో బయో మెట్రిక్ విధానంలో రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించినట్టు కోర్టుకు కేంద్రం విన్నవించింది. 32 రాష్ట్రాలకు చెందిన జాతీయ ఆహార భద్రత చట్టం లోని 69 కోట్ల మంది లబ్ధిదారుల్ని వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పరిధి లోకి తెచ్చినట్టు బాటి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News