న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు విస్తృత అధికారాలను ఇచ్చే మనీలాండరింగ్ చట్టాన్ని సమీక్షించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ విచారణ నిర్వహించారు. ఈడీ అధికారాలకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పులో రెండు అంశాలను సమీక్షించాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈసీఐఆర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు)ను ఇవ్వక పోవడం, నిందితుల అమాయకత్వాన్ని పరిగణన లోకి తీసుకోవడాన్ని తిరస్కరించే అంశాలను పునస్సమీక్షించాలని పేర్కొంది. నగదు అక్రమ చెలామణీ నిరోధక చట్టం ద్వారా ఈడీకి లభించిన ఆధారాలను సమర్ధిస్తూ సుప్రీం కోర్టులో జస్టిస్ ఖన్విల్కర్ నేతృత్వం లోని బెంచ్ జులైలో తీర్పును వెలువరించింది. ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ తీర్పు మొత్తాన్ని పునస్సమీక్షించడాన్ని వ్యతిరేకించారు. అదే సమయంలో తీర్పు లోని రెండు అంశాలకు సంబంధించే నోటీసులను పరిమితం చేయాలని సూచించారు. మరోవైపు కార్తీ చిదంబరం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. పూర్తి తీర్పునే పునస్సమీక్షించాలని కోరారు.
ఈడీ విస్తృత అధికారాల అంశంపై సుప్రీం కీలక నిర్ణయం
- Advertisement -
- Advertisement -
- Advertisement -