Sunday, January 19, 2025

రైతుల డిమాండ్లపై ఆదేశాలు ఇవ్వలేం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రైతుల న్యాయమైన డిమాండ్లను పిరశీలించాలని, శాంతియుతంగా యాత్ర చేసుకోవడానికి వీలుగా అన్ని అడ్డంకులను తొలగించి దేశ రాజధానిలో సమావేశవ్వడానికి తగిన ఆదేశాలను ఇవ్వాలని కోరుతూ రైతుల తరఫున దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ప్రచా కేవలం వార్తాపత్రిక కథనాల ఆధారంగా ప్రచారం కోసం ఇటువంటి పిటిషన్ వేయడం తగదని పిటిషనర్‌ను సుప్రీంకోర్టు మందలించింది.

ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇదే తరహా పిటిషన్‌పై హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీచేసిందని జస్టిస్ సూర్యకాంత్, స్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తాము ఎవరి పక్షాన మాట్లాడడం లేదని, ఇవి చాలా జఠిలమైన అంశాలని, పూర్తిగా పరిశోధన చేసిన తర్వాతే పిటిషన్ వేయాలని ధర్మాసనం సూచించింది. దీంతో ఈ పిటిషన్‌ను ఉపసఃహరించుకోనున్నట్లు పిటిషనర్ తెలియచేశారు.

రైతులకు చెందిన సోషల్ మీడియా ఖాతాలను అన్‌బ్లాక్ చేయాలని, వాక్ స్వాతంత్య్రాన్ని కాపాడాలని పిటిషనర్ తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. సిక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అర్నస్టోస్ థియోస్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎటువంటి కారణంగా లేకుండానే రైతులను రాజధానిలోకి రాకుండా అడ్డుకుంటున్నారని, రాజ్యాంగంలోని 19(1)(డి) అధికరణ కింద ఏ పౌరుడైనా దేశంలోని ఏ ప్రాంతానికైనా స్వేచ్ఛగా ప్రయాణించే స్వేచ్ఛను ఇది హరించడమేనని పిటిషనర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలను, జాతీయ హానవ హక్కుల కమిషన్‌ను ప్రతివాదులుగా ఆయన తన పిటిషన్‌లో చేర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News