Wednesday, July 3, 2024

నీట్ కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వము:సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

వచ్చే నెల(జులై) 6వ తేదీ నుంచి ప్రారంభం కావలసి ఉన్న నీట్-యుజి 2024 కౌన్సిలింగ్‌తోపాటు సీట్ కేటాయింపు ప్రక్రియను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతోసహా ఇతరులకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. అయితే రెండు రోజుల పాటు అంటే జులై 8వ తేదీ వరకు కౌన్సిలింగ్ ప్రక్రియను వాయిదా వేయాలన్న పిఇషనర్ అభ్యర్థనను జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. నీట్ యుజి పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లతోపాటు ఇతర పిటిషన్లపై జులై 8వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరగపనున్నది. మొదటి దశ కౌన్సిలింగ్ వారం రోజుల పాటు ఉంటుందని, దీన్ని సీట్ల కేటాయింపు ప్రక్రియను నిలిపివేయడం వల్ల సమయం వృథా అవుతుందని బెంచ్ అభిప్రాయపడింది. తమ నోటీసులకు రెండు వారాలలో ఎన్‌టిఎ, కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని బెంచ్ ఆదేశించింది.

ఇతర ప్రతివాదులు కూడా తమ సమాధానాలు తదుపరి విచారణ తేదీలోపు సమర్పించాలని బెంచ్ కోరింది. ప్రశ్నాపత్రం లీకేజీ, ఇతర అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నీట్ పరీక్షకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. కాగా&మాస్ చీటింగ్, అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయన్న కారణంపై ఆల్ ఇండియా ప్రి మెడికల్ టెస్ట్(ఎఐపిఎంటి)ను రద్దు చేసి నాలుగు వారాలలో మళ్లీ పరీక్షను నిర్వహించాలని 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్ల తరఫు న్యాయవాది అలఖ్ అలోక్ శ్రీవాస్తవ గుర్తు చేశారు. ఐఎపిఎంటి 2015తో పోలిస్తే నీట్ యుజి 2024 పరీక్షలో జరిగిన అక్రమాలు మరింత ఘోరమైనవని, ఈ కేసులో కూడా అదే తరహా ఆదేశాలు కావాలని ఆయన సుప్రీంకోర్టును అర్థించారు. దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నీట్ యుజి పరీక్షను వెంటనే రద్దు చేసి కౌన్సిలింగ్,

సీట్ల కేటాయింపు ప్రక్రియను నిలిపివేయాలని శ్రీవాస్తవ కోరారు. బీహార్ పోలీసులకు చెందిన ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన వాంగ్మూలాల దృష్టా నీట్ యుజి 2024ను రద్దు చేయాల్సిన ఆవశ్యకత ఉందని కూడా పిటిషనర్ వాదించారు. ప్రశ్నాపత్రం లీకైందని, పరీక్ష తేదీ ముందు రోజున కొందరు అభ్యర్థులకు ప్రశ్నాపత్రాన్ని అందచేయడం జరిగిందని అరెస్టయిన కొందరు నిందితులు ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టు దృష్టికి శ్రీవాస్తవ తీసుకువచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News