Monday, December 23, 2024

మణిపూర్‌లో ఇంటర్నెట్ షట్‌డౌన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ!

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: హింసాకాండకు గురైన మణిపూర్‌లో ఇంటర్నెట్ షట్‌డౌన్‌ను సవాలుచేస్తూ దాఖలైని పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ‘ఇప్పటికే ఈ విషయం హైకోర్టులో ఉండగా, మళ్లీ ఈ డుప్లికేట్ వినతి ఎందుకు? కోర్టు తిరిగి తెరుచుకున్నాక రెగ్యులర్ ధర్మాసనం ముందుకు ఇది రాగలదు’ అని వెకేషన్ బెంచ్ న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, రాజేశ్ బిండాల్ తెలిపారు. సుప్రీంకోర్టు జూలై 3న తిరిగి తెరుచుకోనున్నది. అప్పటి వరకు అర్జెంట్ విషయాలను వెకేషన్ బెంచ్ విచారిస్తోంది.

పిటిషనర్ల తరఫున ధర్మాసనం ముందు హాజరైన న్యాయవాది షాదాన్ ఫరాసత్ 35 రోజులుగా మణిపూర్‌లో ఇంటర్నెట్ మూసివేసి ఉందన్నారు. మణిపూర్ రాష్ట్రం తరఫున హాజరైన న్యాయవాది పుఖ్రంబం రమేశ్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే మణిపూర్ హైకోర్టులో ఐదు పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, అవి ఇంటర్నెట్ నిషేధాన్ని కూడా సవాలు చేస్తున్నాయన్నారు. అప్పుడు ధర్మాసనం తాజా పిటిషన్ నిర్ణీత సమయంలో మాత్రమే రావాలని పేర్కొంది.
మణిపూర్‌లో మే 3న మొదలైన మెయిటీ, కుకీల తెగల ఘర్షణ కారణంగా ఇప్పటి వరకు కనీసం 102 మంది చనిపోయారు, 300 మందికి గాయాలయ్యాయి, 40వేల మంది నిరాశ్రయులయ్యారు. కాగా మణిపూర్ ఇంటర్నెట్‌పై నిషేధాన్ని జూన్ 10 వరకు పొడగించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News