- Advertisement -
న్యూఢిల్లీ : వ్యభిచారిణులకు ఆధార్ కార్డలు జారీ చేయాలని సుప్రీంకోర్టు గురువారం సంబంధిత అధికారులను ఆదేశించింది. విశిష్ట గుర్తింపు ప్రక్రియల భారత సాధికారిక సంస్థ (ఉడాయ్) వెలువరించిన నిర్ధేశిత సర్టిఫికెట్ల ప్రాతిపదికన సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు వెలువరించాల్సి ఉంటుంది. దేశంలో ప్రతి వ్యక్తి వారివారి విధులు వృత్తితో నిమిత్తం లేకుండా సమాజంలో సముచిత మన్నన మర్యాదలు పొందాలి. ఈ విధంగా పొందడం ప్రతి వ్యక్తి ప్రాధమిక హక్కు అని సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు సారధ్యపు ధర్మాసనం తెలిపింది. సెక్స్ వర్కర్లకు ఆధార్‌కార్డుల జారీ క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి గుర్తింపు రహస్యంగా ఉంచాలి. గోప్యత అత్యంత కీలకం, దీనిని ఉల్లంఘించరాదని ధర్మాసనం తెలిపింది.
- Advertisement -