Sunday, February 23, 2025

ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు సుప్రీంలో చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత సత్యేందర్ జైన్ సాధారణ బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టేసింది. ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్న ఆయనను వెంటనే లొంగిపోవాలని న్యాయమూర్తులు బేలా ఎం త్రివేది, పంకజ్ మిథాల్‌లతోకూడిన ధర్మాసనం ఆదేశించింది. లొంగిపోయేందుకు వారం రోజుల గడువు ఇవ్వాలంటూ జైన్ న్యాయవాది చేసిన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసి పుచ్చింది.

వైద్య కారణాలతో 2023 మే 26న జైన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఉన్నత న్యాయస్థానం దానిని పొడిగిస్తూ వచ్చింది. 201516 సమయంలో జైన్ సంస్థలకు హవాలా నెట్‌వర్క్ ద్వారా పలు షెల్ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్లు ముట్టినట్టు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. ఈ క్రమంలో ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. 2022 మే 30న ఆయనను అరెస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News