Monday, December 23, 2024

స్వచ్ఛమైన గాలి.. స్వీట్లతో దివాళీ

- Advertisement -
- Advertisement -

Supreme Court dismisses firecrackers ban petition

బాణసంచా నిషేధ పిటిషన్ కొట్టేసిన సుప్రీం

న్యూఢిల్లీ : మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. శ్వాస కాలుష్యం కారాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా వాడకంపై నిషేధాన్ని ఎత్తివేయాలనే పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ నెల 24వ తేదీ దీపావళి నేపథ్యంలో ఢిల్లీలో వాయుకాలుష్య నివారణ చర్యలలో భాగంగా టపాకుల అమ్మకాలు, వాడకాలపై నిషేధం విధించారు. అత్యంత కఠిన శిక్షలుంటాయని హెచ్చరించారు. ఆప్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తర్వులను బిజెపి ఎంపి మనోజ్ తివారీ సుప్రీంకోర్టులో ఈ నెల 10న పిటిషన్ దాఖలు చేశారు. స్టే కానీ ఇతర ఆదేశాలను కానీ తాము వెలువరించడం లేదు. ఇప్పటికే ఈ అంశంపై తాము నిర్థిష్టమైన ఆదేశాలు జారీ చేశామని ధర్మాసనం తెలిపింది. దీపావళి సమీపిస్తున్నందున వెంటనే తమ పిటిషన్‌ను విచారించాలని పిటిషనర్ తరఫు లాయర్ శశాంక్ శేఖర్ ఝా చేసిన అభ్యర్థనపై కోర్టు స్పందిస్తూ కాలుష్యం కొనితెచ్చుకోవడానికి డబ్బులు తగిలేయడం ఎందుకు? స్వీట్లకు ఇతరత్రా దీనిని వినియోగించండి అని వ్యాఖ్యానించింది. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటే మనకే మంచిది కదా అని పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్యం ఏ విధంగా ఉందో పిటిషనర్‌కు తెలుసుకదా? అని ఎంపిని నిలదీసింది.

బిజెపి- ఆప్ మధ్య మరో చిచ్చుబుడ్డి?

దీపావళి నేపథ్యంలో ఢిల్లీ ఆప్ ప్రభుత్వం టపాకులపై నిషేధం విధించడం, వీటిని వాడినా కొన్నా, విక్రయించినా మూడేళ్ల జైలు శిక్ష అని ఉత్తర్వులు వెలువరించడం సంచలనాత్మక వివాదం అయింది. బిజెపి హిందూ సామాజిక వర్గాలు, మితవాద సంస్థలు ప్రత్యేకించి ఈ నిషేధం కేవలం సాంప్రదాయక ఆచార వ్యవహారాలపై వివక్షతో కూడినదని విమర్శిస్తున్నాయి. హిందూ పండుగలలో ఉండే పద్ధతులను ఆప్ ఈ విధంగా దెబ్బతీస్తోందని విమర్శించారు. ఆప్ నేత వైఖరి వింతగా ఉందని ఢిల్లీ బిజెపి నేత తజీందర్ పాల్ సింగ్ బగ్గా మండిపడ్డారు. హిందువులు దీపావళి సందర్భంగా బాణసంచా కాలిస్తే అది నేరం అవుతుందా? కాలుష్యానికి దారితీస్తుంది. కేజ్రీవాల్ వీరిని జైలుకు పంపిస్తారా? అయితే ఆప్ నేతల సభలలో టపాకులు కాలిస్తే కాలుష్యం కాకుండా ఆక్సిజన్ వెలువడుతుందా? అని ప్రశ్నించారు. ఆప్ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ మంత్రి అయినప్పుడు మద్దతుదార్లు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చిన దృశ్యాల వీడియోను బగ్గా జోడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News