Saturday, April 12, 2025

గ్రూప్‌-1 అభ్యర్థులకు సుప్రీంకోర్టు శుభవార్త

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గ్రూప్-1 అభ్యర్థులకు సర్వోన్నత న్యాయస్థానం శుభవార్తను అందించింది. 2022లో దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి జారీ చేసిన జివొ 55కు సవరణ తీసుకొస్తూ.. ఫిబ్రవరి 8వ తేదీన తెలంగాణ ప్రభుత్వం జివొ 29ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిని రద్దు చేయాలని.. గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు జివొ 29 చెల్లుబాటు పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో గ్రూప్‌-1 నియామకాలకు అడ్డంకి తొలగిపోయింది. ఇప్పటికే టిజిపిఎస్‌సి గ్రూప్-1 జనరల్ ర్యాంకులను విడుదల చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే 1:2 నిష్పత్తిలో సర్టిఫికేట్ల పరిశీలన జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News