Sunday, January 26, 2025

జానీ మాస్టర్ బెయిల్ రద్దు కోరిన పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 24న ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

జానీ మాస్టర్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్  సుప్రీంకోర్టు ముందు శుక్రవారం విచారణకు వచ్చింది. అయితే న్యాయమూర్తులు బేలా ఎం.త్రివేది, సతీశ్ చంద్ర మిశ్రలతో కూడిన ధర్మాసనం దానిని డిస్మిస్ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News