Friday, November 22, 2024

నీట్ వాయిదాపై పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వచ్చే నెల(మార్చి) 5వ తేదీన జరగవలసి ఉన్న నీట్ పిజి 2023 వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ పిజి) లేదా నీట్‌ను వాయిదా వేయాలని కోరుతూ చాలా తక్కువ సంఖ్యలో దరఖాస్తుదారులు ఉన్నారని సీనియర్ న్యాయవాది ఐశ్వర్య భటి కోర్టుకు తెలిపారు.

నీట్‌కు సుమారు 2.3 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఇంటర్న్‌షిప్ గడువును పొడిగించిన కారణంగా కేవలం ఆరువేల మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, ఈ సంఖ్య చాలా స్వల్పమని భటి వివరించారు. జులై 15 నుంచి నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్‌బిఇ) కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్లు న్యాయవాది తెలిపారు. ఇంటర్న్‌షిప్ ని పూర్తి చేయవలసి ఉన్న విద్యార్థులను తరువాత కేసు వారీగా పరిశీలించవచ్చని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News