Monday, December 23, 2024

బెంచ్ మార్పిడి హైకోర్టు అంశమే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో విచారణ బదలాయింపు పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేసును 2021 నుంచి విచారిస్తోన్న ఏకసభ్య న్యాయమూర్తితో కూడిన బెంచ్ నుంచి తప్పించి అలహాబాద్ హైకోర్టు దీనిని వేరే ధర్మాసనానికి అప్పగించింది. చీఫ్ జస్టిస్ రూలింగ్‌ను సవాలు చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనికి ఇక్కడ చుక్కెదురైంది. మసీదు తరఫున లాయర్ హుజెఫా అహ్మదీ తమ వాదనలు విన్పించారు. అయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలలో తాము జోక్యం చేసుకోవడం కుదరదని , వాస్తవిక పరిస్థితుల ప్రాతిపదికన హైకోర్టు వ్యవహరించి ఉంటుందని, ఈ పరిధిలోకి తాము వెళ్లదల్చుకోలేదని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసం పేర్కొంది. సవాలు పిటిషన్ కొట్టివేతను ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News