Wednesday, November 20, 2024

కోర్టులు కొందరి పబ్లిసిటీ వేదికలు కావు

- Advertisement -
- Advertisement -

Courts are not publicity platforms: Supreme Court

ఇవిఎంలపై పిటిషన్‌పై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : న్యాయస్థానాలు బాజా వేదికలు కావని, తమకు ప్రచారం దక్కుతుందని ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిపోయే కూడళ్లు కావని సుప్రీంకోర్టు స్పందించింది. దేశంలో ఇవిఎంలు కొన్ని కంపెనీల ఆధీనంలో ఉన్నాయని, ఎన్నికల కమిషన్ అదుపు ఆజ్ఞలలో లేవని, దీనిపై న్యాయస్థానం కలుగచేసుకోవాలని ఓ రాజకీయ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. ప్రతి ఒక్కరు రావడం పబ్లిసిటీకోసం పిటిషన్లు దాఖలు చేయడం తమాషాగా ఉందా? అని నిలదీసింది. ఎన్నికలలో ఓట్ల ప్రక్రియ కోసం ఇవిఎంలను దశాబ్దాలుగా వాడుతున్నారు. 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టం పరిధిలో ని ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగానే ఇవిఎంలు వాడుతున్నారని న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్, ఎఎస్ ఓకా ఆధ్వర్యంలోని ధర్మాసనం తెలిపింది. మధ్యప్రదేశ్ జన్ వికాస్ పార్టీ ఇవిఎంలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను గత ఏడాది మధ్యప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది. దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఈ పార్టీ ఆశ్రయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News