Friday, December 27, 2024

రాజ్యాంగానికి 1976 సవరణకు సవాల్ పిటిషన్లు కొట్టివేత

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగం పీఠికలకు ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’. ‘సమగ్రత’ పదాలు చేరుస్తూ 1976లో రాజ్యాంగానికి చేసిన సవరణను సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లను సుప్రీం కోర్టు సోమవారం గణనీయమైన తీర్పులో కొట్టివేసింది. 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రతిపాదించిన 42వ రాజ్యాంగ సవరణ కింద రాజ్యాంగం పీఠికలోకి ‘సోషలిస్’్ట, ‘సెక్యులర్’, ‘సమగ్రత’ పదాలను చేర్చారు. రాజ్యాంగం పీఠికకు ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ పదాలను చేర్చడాన్ని సవాల్ చేస్తూ రాజ్యసభ మాజీ ఎంపి సుబ్రహ్మణ్యం స్వామి, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై తమ తీర్పును ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ నెల 22న రిజర్వ్ చేసింది. ఈ అంశంపై మొదటి పిటిషన్లలో ఒకదానిని న్యాయవాది

విష్ణు శంకర్ జైన్ ద్వారా బలరామ్ సింగ్ అనే వ్యక్తి 2020లో దాఖలు చేశారు. ‘రిట్ పిటిషన్లపై మరింతగా చర్చ జరపవలసిన, తీర్పు చెప్పవలసిన అవసరం లేదు. రాజ్యాంగంపై పార్లమెంట్‌కు గల సవరణ అధికారం పీఠికకూ వర్తిస్తుంది’ అని సిజెఐ తీర్పు వెలువరిస్తూ చెప్పారు. ఇన్ని సంవత్సరాల తరువాత ఆ ప్రక్రియను అలా రద్దు చేయజాలరని తీర్పు వివరించిందని సిజెఐ తెలిపారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ 368 అధికరణం కింద ప్రభుత్వాధికారాన్ని కుదించబోదని, పైగా ఇది సవాల్ కిందకు రాదని బెంచ్ పేర్కొన్నది. పార్లమెంట్‌కు గల సవరించే అధికారం పీఠికకు కూడా వర్తిస్తుందని బెంచ్ స్పష్టం చేసింది. ‘ఇన్ని సంవత్సరాలు గడచిన తరువాత ఇప్పుడు ఈ సమస్యను రేకెత్తించడం ఎందుకు’ అని కూడా సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వివరణాత్మక తీర్పు వెలువడ వలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News