Thursday, January 23, 2025

గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం షాక్

- Advertisement -
- Advertisement -

బిల్కిస్ బానో కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు గురువారం గుజరాత్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఈ ఈ కేసులో దోషుల విడుదల వ్యవహారంలో ప్రభుత్వంపై తాము వెలువరించిన వ్యాఖ్యల ఉపసంహరణకు అత్యున్నత న్యాయస్థానంతిరస్కరించింది. సంబంధిత విషయంలో ఓపెన్ కోర్టులో తమ పిటిషన్ విచారణ జరగాలని, దీనిని ఈ క్రమంలో జాబితాలో పెట్టాలని కూడా గుజరాత్ ప్రభుత్వం కోరింది. అయితే దీనిని కూడా న్యాయమూర్తులు బివి నాగరత్న, ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని, గుజరాత్ ప్రభుత్వ రివ్యూ పిటిషన్ కొట్టివేస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. తాము ఇంతకు ముందు ఈ విషయంలో వెలువరించి ఉన్న వ్యాఖ్యలను పరిశీలించామని, ఇందులో ఎటువంటి తప్పిదాలు లేవని నిర్థారణకు వచ్చామని వెల్లడించారు. ఇక వ్యాఖ్యల ఉపసంహరణ పిటిషన్ లో ఎటువంటి ఔచిత్యత లేదని తమకు విదితం అయిందని తెలిపారు.

ఇంతకు ముందటి ఆదేశాల సమీక్ష కుదరదని కూడా తేల్చేశారు. ఈ క్రమంలో ఈ పిటిషన్‌ను కొట్టివేయడం జరుగుతోందని తెలిపారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన సుప్రీంకోర్టు బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలకు సంబంధించిన గుజరాత్ ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేసింది. అత్యంత హేయమైన దారుణ ఘటనలో 11 మందికి దోషులుగా శిక్షలు విధించారు. వీరికి శిక్షల తగ్గింపు అనుచితం అవుతుందని కూడా అప్పట్లో న్యాయస్థానం స్పందించింది. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ తీరును తూర్పార పట్టింది. ప్రభుత్వం అధికార దుర్వినియోగం మితిమీరింది. ఘోరం జరిగినప్పుడు శిక్షలు పడ్డ వారి పట్ల అధికారిక వ్యవస్థ మెతక వైఖరిని , వారి పట్ల మానవీయతను ప్రదర్శిస్తే ఇక ఇంతకంటే దారుణం ఉంటుందా? అని కూడా ధర్మాసనం తీవ్రస్థాయి వ్యాఖ్యలకు దిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు వెలువరించిన రూలింగ్‌తో ఇకపై కూడా సదరు వ్యాఖ్యలు గుజరాత్ ప్రభుత్వానికి మరకలుగానే మిగిలి ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News