Monday, December 23, 2024

మార్గదర్శి చిట్‌ఫండ్ కేసు బదిలీ పిటిషన్లను డిస్మిస్ చేసిన సుప్రీం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మార్గదర్శి చిట్‌ఫండ్ కేసు బదిలీపై ఎపి ప్రభుత్వం పిటిషిన్లపై విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. విచారణ నిర్ణయం ఇప్పటికే జరిగినందున మళ్లీ విచారణ అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. బదిలీ పిటిషన్లపై మళ్లీ విచారణ అవసరం లేదని కేసును ముగించింది. కేసులో ఉన్న మెరిట్స్ ఆధారంగా తెలంగాణ హైకోర్టు విచారణ చేస్తుందని, చెప్పాలనుకున్న విషయాలన్నీ తెలంగాణ హైకోర్టుకు ముందు చెప్పండనీ ఎపి న్యాయవాదులకు సూచనలు చేశారు. తెలంగాణ హైకోర్టు తుది ఆదేశాలు ఇచ్చాక మళ్లీ సుప్రీంకోర్టుకు రావచ్చని జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ కెవి విశ్వనాథన్ బెంచ్ తుది తీర్పును వెల్లడించింది. ఈనాడు గ్రూపుల అధినేత రామోజీరావు, శైలజపై కఠిన చర్యలు వద్దని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులో జోక్యంచేసుకోవద్దని సుప్రీం సూచించింది.

Also Read: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలి: నామా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News