న్యూఢిల్లీ : ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై నమోదైన కోర్టు ధిక్కార అభియోగాలపై విచారణ నిలిపి వేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. 2009 లో తెహల్కా పత్రికతో మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో అవినీతిపై చేసిన వ్యాఖ్యలకు గాను ఈ చర్యలు చేపట్టారు. ఆగస్టు 30న జస్టిస్ ఇందిరా బెనర్జీ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎటువంటి పరిస్థితుల్లో ఆ వ్యాఖ్యలు చేయాల్సివచ్చిందో వివరిస్తూ ప్రశాంత్ భూషణ్ ఇచ్చిన వివరణకు కోర్టు సానుకూలంగా స్పందించింది. ఆయనపై కోర్టు ధిక్కార చర్యలను కొనసాగించాల్సిన అవసరం లేదని బెంచ్ అభిప్రాయపడింది. తెహల్కా పత్రిక అధిపతి , జర్నలిస్టు తరణ్ తేజ్‌పాల్‌పై కూడా కోర్టు ధిక్కార విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను చివరిసారిగా జస్టిస్ అరుణ్ మిశ్రా, ఎఎన్ ఖాన్విల్కర్ ధర్మాసనం చేపట్టింది. ఇప్పుడు వీరిద్దరూ పదవీ విరమణ చేశారు.
ఈ కేసు పూర్వాపరాలు
2009లో తెహల్కా మ్యాగజైన్‌కు ఓ ఇంటర్వూ ఇస్తూ ప్రశాంత్ భూషణ్ న్యాయవ్యవస్థలో అవినీతిపై వ్యాఖ్యలు చేశారు. కొందరు సుప్రీం సీజేలను కూడా తప్పుపట్టారు. సుప్రీం ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కోర్టు ధిక్కార అభియోగాలను నమోదు చేసింది. దీంతోపాటు తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ పేరును కూడా దీనిలో చేర్చింది. వాస్తవానికి ప్రశాంత్ భూషణ్ ఇచ్చిన ఇంటర్వూలో ఆర్థిక అవినీతినే కాకుండా విస్తృతమైన అంశాలను చేర్చడం కోసం ‘అవినీతి’ అనే పదాన్ని వాడారు.
కోర్టు ధిక్కార కేసు నుంచి ప్రశాంత్ భూషణ్‌కు పెద్ద ఊరట
- Advertisement -
- Advertisement -
- Advertisement -