Sunday, December 22, 2024

వైద్యుల కొరత ఉంటే.. నీట్ పీజీ సీట్లను ఖాళీగా ఉంచుతారా ?

- Advertisement -
- Advertisement -

Supreme Court expresses disapproval over Medical Counselling

మెడికల్ కౌన్సిల్ తీరుపై సుప్రీం తీవ్ర అసహనం

న్యూఢిల్లీ : నీట్ పీజీ సీట్ల భర్తీలో భారత వైద్య మండలి వ్యవహరించిన తీరు పట్ల సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఓ వైపు దేశంలో వైద్యుల కొరత ఉన్న వేళ, వైద్య కళాశాలల్లో ఈ ఏడాది 1456 సీట్లు ఖాళీగా ఉండటంపై ఆగ్రహించింది. సీట్లను ఖాళీగా ఉంచి ఏం సాధించారని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీని ప్రశ్నించింది. విద్యార్థుల భవితతో ఆటలాడుతున్నారా ? అని మండిపడింది. కౌన్సెలింగ్ నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ కొందరు వైద్య విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధా బోస్‌లతో కూడిన ధర్మాసనం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఒక్క సీటు ఖాళీగా ఉందని తెలిసినా, దాని భర్తీ చేయాల్సిన బాధ్యత మీదే. నీట్ పీజీలో దేశ వ్యాప్తంగా 1456 సీట్లు భర్తీ కాలేదని అధికారులు మే నెలలోనే గుర్తించారు. అలాంటప్పుడు మాప్ ఆఫ్ రౌండ్ కౌన్సెలింగ్ ఎందుకు నిర్వహించలేదు. దేశంలో వైద్యుల అవసరం ఉన్నప్పుడు , సీట్లను ఖాళీగా ఉంచి, మీరేం సాధించారు ? సీట్ల విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఎంత ఒత్తిడి ఉంటుందో మీకు తెలుసా ? విద్యార్థుల భవితతో మీరు ఆటలాడుతున్నారా ? అని ధర్మాసనం ప్రశ్నించింది. నీట్ పీజీ కౌన్సెలింగ్‌లో సీట్ల భర్తీ , ఖాళీలపై ఈ సాయంత్రం లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీనిపై రేపు తదుపరి విచారణ చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News