Friday, November 22, 2024

వరవరరావు బెయిల్‌ను మరోసారి పొడిగించిన సుప్రీం

- Advertisement -
- Advertisement -

Supreme Court extends interim bail of Varavara Rao

న్యూఢిల్లీ : విరసం నేత వరవరరావు మెడికల్ బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు మరోసారి వాయిదా వేసింది. భీమా కొరెగావ్ కేసులో నిందితునిగా ఉన్న వరవరరావు వైద్య కారణాల రీత్యా తనకు శాశ్వత బెయిల్ ఇవ్వాలని బాంబే హైకోర్టును కోరారు. ఆ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టేయడంతో దాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే విచారణకు అవసరమైన పత్రాల సమర్పణకు ఒక్కరోజు గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తి చేయడంతో కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం మళ్లీ విచారణ జరగ్గా ఇరుపక్షాల న్యాయవాదులు మరోసారి సమయం కోరారు. దీంతో విచారణను జులై 19కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. అయితే ఈ బెయిల్ గడువు ముగియడంతో వరవరరావు సాయంత్రం లొంగిపోవాల్సి ఉంది. కానీ ఈనెల 19 వరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితినే కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News