Thursday, January 23, 2025

దేశవ్యాప్తంగా కూల్చివేతలపై  స్టే పొడగించిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా కూల్చివేతలపై స్టే ను సుప్రీంకోర్టు మంగళవారం పొడగించింది. న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం అక్రమ నిర్మాణాలను కూల్చివేయడాన్ని నివారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనేక రాష్ట్రాల్లో తగిన సమయం ఇస్తూ నోటీసులు జారీచేయకుండానే కట్టడాలను కూల్చివేయడంపై అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. చట్ట విరుద్ధంగా అక్రమ కట్టడాలుంటే కూల్చేయాల్సిందే. కానీ దానికీ ఓ ప్రొసీజర్ ప్రకారమే వెళ్లాల్సి ఉంటుంది.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రిజిష్టర్ పోస్ట్ ద్వారా నోటీసు పంపాలని, ఒకవేళ దానిని తీసుకోకపోతే వేరే పద్ధతిలో నోటీసు ఇవ్వాలని అన్నారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సి.యు.సింగ్ వాదిస్తూ దేశమంతటా ఒకే రకమైన నోటీస్ పీరియడ్ ఉండాలన్నారు.

‘‘అక్రమ కట్టడం అని అధికారులు నిర్ధారణకు వస్తే ఆ ప్రాంతమంతా సర్వే చేయాలి. ఓ నిర్దిష్ట పరిసరాల్లోనే కూల్చేయకూడదు. ప్రత్యేకంగా ఓ ఇంటికే వెళ్లి కూల్చేయకూడదు. ప్రతిదీ మేము చట్ట ప్రకారం చేసామనకూడదు’’ అని న్యాయవాది ఎం.ఆర్. శంషాద్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News