- Advertisement -
సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేసిన ఫాతిమా బీవీ ఇక లేరు. ఆమె కొల్లాంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం కన్నుమూశారు. ఫాతిమా బీవీ వయసు 96 ఏళ్లు. తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా కూడా ఆమె సేవలు అందించారు.
ఫాతిమా ట్రావెంకోర్ సమీపంలోని పతనంతిట్ట గ్రామంలో 1927 ఏప్రిల్ 30న జన్మించారు. తిరువనంతపురంలోని ప్రభుత్వ లా కళాశాలనుంచి బిఎల్ డిగ్రీ తీసుకున్నారు. 1983లో హైకోర్టు జడ్జిగాను, 1989లో సుప్రీంకోర్టు జడ్జిగానూ పదోన్నతి పొందారు. 1992లో రిటైరయ్యారు. ఫాతిమా బీవీ 1997 జనవరి 25న తమిళనాడు గవర్నర్ గా నియమితులయ్యారు. అయితే ఆమె పూర్తికాలం పదవిలో కొనసాగలేదు.
- Advertisement -