Monday, January 13, 2025

ప్రార్థనా స్థలాల చట్టం పిటిషన్లపై విచారణకు వచ్చే వారం సుప్రీకోర్టు ప్రత్యేక ధర్మాసనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రార్ధనా స్థలాల చట్టం 1991ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను డిసెంబర్ 12న సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనంలో న్యాయమూర్తులు సంజయ్ కుమార్, జస్టిస్ కెవి. విశ్వనాథన్ సభ్యులుగా ఉంటారు.

ఆగష్టు 15, 1947 నాటి ప్రార్థనా స్థలం యొక్క స్వభావాన్ని కొనసాగించాలని, ఈ తేదీ ముందు ఏ సమయంలోనైనా ఏదైనా మతపరమైన ఆస్తుల ఆక్రమణకు గురైన ఏదైనా వివాదానికి సంబంధించి ఏ న్యాయస్థానంలో దావా లేదా విచారణ జరగదని చట్టం ప్రకటించింది.

ఈ పిటిషన్‌లపై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసి, మార్చి 12, 2021న కేంద్రం అభిప్రాయాలను కోరింది. ప్రతిస్పందించడానికి మరింత సమయం కావాలని కేంద్రం చేసిన అభ్యర్థనల నేపథ్యంలో విచారణ పలుమార్లు వాయిదా పడింది. అయితే, పలుమార్లు వాయిదాలు వేసినప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News