సుప్రీంకోర్టుకు 34 జడ్జీలను ఆమోదించగా, ప్రస్తుతం వారి సంఖ్య 32కు పెరిగింది.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు సోమవారం ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం జరిగింది. కొత్త న్యాయమూర్తులు పంకజ్ మిఠల్, సంజయ్ కరోల్, పి.వి. సంజయ్ కుమార్, అహసనుద్దీన్ అమానుల్లాహ్, మనోజ్ మిశ్రాలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదుల కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.
కొలీజియం సిఫార్సు, అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి సూచనతో సుప్రీంకోర్టు కేంద్రాన్ని హెచ్చరించింది. తదుపరి పరిణామాలకు సిద్ధం కమ్మంది. దాంతో కేంద్రం కూడా దిగిరావడంతో సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తులతో ప్రమాణస్వీకారం చేయించింది. ఇంకా ఇద్దరి న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించాలంటూ జనవరి 31 సుప్రీంకోర్టు ముందుంచిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంచింది.
ఆరుగురు సభ్యుల కొలీజియం 2022 డిసెంబర్ 13న న్యాయమూర్తులు పంకజ్ మిఠల్, సంజయ్ కరోల్, పి.వి. సంజయ్ కుమార్, అహసానుద్దీన్ అమానుల్లాహ్, మనోజ్ మిశ్రా పేర్లను సిఫార్సు చేసింది.