Tuesday, November 5, 2024

సుప్రీంకోర్టులో ఇద్దరు కొత్త జడ్జిల ప్రమాణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో మరో ఇద్దరు న్యాయమూర్తులు చేరారు. కొత్తగా నియమితులైన జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ ఎస్ వెంకట నారాయణ భట్టిల చేత సిజెఐ డివై చంద్రచూడ్ శుక్రవారం సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు పూర్తి సంఖ్యాబలం 34 కాగా ఈ ఇద్దరి చేరికతో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది. తెలంగాణ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి భూయాన్, కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి భట్టిల పదోన్నతికి ఇటీవల కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బుధవారం వీరి నియామకకాలపై ఒక ప్రకటన చేశారు.
జస్టిస్ భూయాన్
1964 ఆగస్టు 2న జన్మించిన భూయాన్ 2011 అక్టోబర్ 17న గౌహతి హౌకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సీనియర్ న్యాయమూర్తిగా భూయాన్ 2022 జూన్ 29న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయశాఖలో ముఖ్యంగా టాక్సేషన్‌లో ఆయనకు విశేష అనుభవం ఉంది. భూయాన్ గతంలో బొంబాయి హైకోర్టు జడ్జిగా కూడా సేవలందించారు.
జస్టిస్ వెంకట నారాయణ భట్టి
జస్టిస్ వెంకటనారాయణ భట్టి 1962 మే6న జన్మించారు.2013 ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ఆయన తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. సీనియర్ మోస్ట్ జడ్జిగా నిలిచారు. ఆయన 2019లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అనంతరం 2023 జూన్ 1న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. కాగా 2022 ఆగస్టునుంచి సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం లేనందున ఆయన నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News