- Advertisement -
ఢిల్లీ: జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. ఈ కేసులో మోహన్ బాబుకు సుప్రీం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత సంవత్సరం డిసెంబర్ 10న జల్‌పల్లిలో మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్న సమయంలో మోహన్ బాబును ఓ టివి విలేకరి ప్రశ్నించాడు. కోపంతో రగిలిపోయిన మోహన్‌బాబు విలేకరి చేతిలో ఉన్న మైకును లాక్కొని అతడిపై దాడి చేశారు. దీంతో మోహన్‌బాబుపై సదరు విలేకరి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసులో మోహన్‌బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఊరట లభించింది.
- Advertisement -