న్యూఢిల్లీ: 2021 లఖింపూర్ ఖేరీ హింసాకాండకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీం కోర్టులో సోమవారం బెయిల్ మంజూరైంది. ఈ కేసులో రైతులకు కూడా బెయిలు మంజూరైంది. అతని కదలికలను ఢిల్లీ లేదా లక్నోకు పరిమితం చేసింది. 2021లో లఖింపూర్ ఖేరీలో ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు వ్యతిరేకంగా పర్యటనకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన హింసాకాండగా మారింది.
నిరసన చేస్తున్న రైతుల మీదకు ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లిన సంఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసాకాండలో మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడు కావడంతో అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో మిశ్రాకు గత ఏడాది జనవరి 25న మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ కేసులో 117 మంది సాక్షులలో ఏడుగురిని మాత్రమే ఇప్పటివరకు విచారించి నందున విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని ధర్మాసనం ఆదేశించింది.