Sunday, February 23, 2025

సీతాపూర్ కేసులో మహ్మద్ జుబేర్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్

- Advertisement -
- Advertisement -
Jubair2
అయితే ‘ఆల్ట్ న్యూస్’ సహ-వ్యవస్థాపకుడు ఢిల్లీ పోలీసుల ప్రత్యేక ఎఫ్ ఐఆర్ కింద జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతారు.

న్యూఢిల్లీ:   మతపరమైన భావాలను కించపరిచినందుకు ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం పరిమిత మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు మిస్టర్ జుబైర్‌పై కేసు నమోదు చేశారు. అతను “మా విశ్వాసాన్ని సూచించే మతపరమైన ప్రదేశాలలోని మహంతుల పట్ల అభ్యంతరకరమైన పదాలు, తద్వారా మా మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా” ట్వీట్ చేసాడనే ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేశారు. జుబైర్ “అసంబద్ధమైన” ఆరోపణలపై దర్యాప్తును నిలిపివేయాలని, సీతాపూర్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అయితే ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ప్రత్యేక ఎఫ్‌ఐఆర్‌లో జుబైర్ జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటాడు. ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు రాలేదు. కోర్టు కేసు యూపికి మాత్రమే సంబంధించినది.

జుబైర్ ఎలక్ట్రానిక్ లేదా ఇతరత్రా ఎలాంటి ట్వీట్లు లేదా సాక్ష్యాలను తారుమారు చేయరాదని బెంచ్ స్పష్టం చేసింది.సీతాపూర్‌ కేసులో దర్యాప్తు, సాక్ష్యాలను స్వాధీనం చేసుకునేందుకు కూడా ఈ ఉత్తర్వు అడ్డుపడదు. కోర్టు తిరిగి ప్రారంభమైనప్పుడు కేసు  రెగ్యులర్ బెంచ్ ముందుకు వస్తుందని ‘వెకేషన్ బెంచ్’(ధర్మాసనం) తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News