Saturday, April 5, 2025

తీస్తా సెతల్వాద్‌కు మధ్యంతర బెయిల్

- Advertisement -
- Advertisement -

Supreme Court grants interim bail to Teesta Setalvad

సుప్రీంకోర్టు నుంచి తాత్కాలిక ఊరట

న్యూఢిల్లీ : సామాజిక కార్యకర్త, హక్కుల ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2002 గుజరాత్ ఘర్షణలకు సంబంధించి ఆమె అమాయకులను కేసులలో ఇరికించేందుకు తప్పుడు సాక్షాలు సృష్టించారనే కేసులో జూన్ 25న అరెస్టు అయ్యారు. ఆమెకు బెయిల్ ఇవ్వడంలో ఎందుకు ఆక్షేపణలు ఉన్నాయనేది తెలియడం లేదని పేర్కొన్న సుప్రీంకోర్టు ఈ దశలో ఆమె బెయిల్ దరఖాస్తును అత్యవసర ప్రాతిపదికన గుజరాత్ హైకోర్టు విచారణకు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది. ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్, న్యాయమూర్తులు ఎస్ రవీంద్రభట్, సుధాంశు ధూలియాతో కూడిన ధర్మాసనం సెతల్వాద్‌కు బెయిల్ ఇచ్చింది. ఆమె తమ పాస్‌పోర్టును ట్రయల్ కోర్టుకు అప్పగించాలని, ఆమె పూర్తిస్థాయి బెయిల్ పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టు ఏదో ఒకటి తేల్చేవరకూ ఈ పాస్‌పోర్టు కోర్టు పరిధిలో ఉంటుందని తెలిపారు.

తప్పుడు సాక్షాలను పుట్టించారనే అంశంపై సాగుతున్న పోలీసు దర్యాప్తు క్రమంలో ఆమె పూర్తిస్థాయిలో సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది. బెయిల్‌కు అభ్యర్థించిన వ్యక్తి ఓ మహిళ. జూన్ నుంచి కస్టడీలో ఉన్నారు. పైగా ఆమెపై వచ్చిన అభియోగాలు 2002కు సంబంధించినవి. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఆమె సంబంధిత పత్రాలు 2012 సంవత్సరానికి చెందినవి. ఇప్పటికే ఆమెకు ఏడురోజుల కస్టడీ విచారణకు కూడా వీలు కల్పించినందున , దర్యాప్తు సంస్థలు ఇప్పటికీ ఆమెకు బెయిల్ ఎందుకు వద్దనుకుంటున్నాయనేది తెలియడం లేదని పేర్కొంటూ బెయిల్ తాత్కాలికంగా ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని భావిస్తూ షరతులతో కూడిన బెయిల్‌కు వీలు కల్పించినట్లు ధర్మాసనం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News