- Advertisement -
న్యూఢిల్లీ: బిజెపి మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో మంగళవారం ఊరట లభించింది. ఆగస్టు 10వ తేదీవరకు ఎలాంటి చర్యలు చేపట్టరాదంటూ ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంతే కాకుండా నుపుర్ శర్మకు ప్రాణాహాని ఉందని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ నుపుర్ శర్మ కోర్టులో ఫిటిషన్ దాఖాలు చేసింది. పలువర్గాల ప్రజల నుంచి తనకు ప్రాణాహాని ఉందని ఆమె కోర్టుకు తెలిపారు. దేశవ్యాప్తంగా తనపై నమోదైన కేసులను ఓకే కేసుగా మార్చాలని కోర్టును కోరారు. ఈ ఫిటిషన్ పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం నుపుర్ శర్మకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
- Advertisement -