Friday, December 20, 2024

ఆరావళికి సుప్రీం ఊపిరి.. కొత్త మైనింగ్ లీజులకు బ్రేక్

- Advertisement -
- Advertisement -

వాయవ్య భారతదేశంలో విస్తరించుకుని ఉన్న పర్యావరణ పరిరక్షక ఆరావళి పర్వత పంక్తికి సుప్రీంకోర్టు రక్షణగా నిలిచింది. ఈ పర్వతాలలో కొత్తగా ఎటువంటి మైనింగ్ లీజులకు దిగరాదని నాలుగు రాష్ట్రాలకు శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు వెలువరించింది. ఈ పర్వతాలలో ఎక్కడ కూడా గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల తవ్వకాల పనులు జరగరాదని విస్పష్ట నిషేధం విధించింది. కొత్తగా లీజులు ఇవ్వరాదు, ఇచ్చిన వాటిని పునరుద్ధరించరాదని సుప్రీంకోర్టు తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు ఈ చర్య అత్యంత ఆవశ్యకమని పేర్కొంది. భారతదేశ వాయవ్యం నుంచి పశ్చిమానికి విస్తరించుకుని ఉన్న ఈ పర్వతాలు తవ్వకాలతో దెబ్బతింటున్న క్రమంలో పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ దశలో న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, ఎఎస్ ఒకాతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. అయితే ఈ నిషేధం ఇప్పుడు సాగుతున్న తవ్వకాల పనులకు వర్తించదని తెలిపారు. ఈ పర్వతశ్రేణుల పరిరక్షణకు నిర్థిష్టమైన ఉత్తర్వులు , కార్యాచరణ అవసరం అని సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్ల క్రమంలో ఈ అత్యంత కీలకమైన పర్యావరణ పరిరక్షణ విషయంలో సుప్రీంకోర్టు అమికస్ క్యూరీని ఏర్పాటు చేసింది. వారి నివేదిక ప్రాతిపదికన ఇకపై ఇక్కడ ఎటువంటి కొత్త మైనింగ్‌లకు అనుమతి ఇవ్వరాదని ఆదేశాలు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News