- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజద్రోహం చట్టానికి సుప్రీంకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్వర్వులు ఇవ్వడంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాచరిక వ్యవస్థ పోయి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి పౌరహక్కుల, ప్రతిపక్ష నేతలపై బ్రిటీష్ నాటి రాజద్రోహం కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం ప్రజాస్వామ్య మూలసూత్రాలకు విరుద్దం అని అన్నారు. సంవత్సరాల తరుబడి జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు. రాజ్యాంగ హక్కులను హరించేదిగా ఈ చట్టం వున్నదన్నారు. రాజులే లేనప్పుడు రాజద్రోహం కేసులు ఎందుకు? కేంద్ర ప్రభుత్వం రాజద్రోహం చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్టు అయ్యి జైళ్లలో మగ్గతున్న రాజకీయ నాయకులు, పౌరహక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
- Advertisement -