Monday, November 18, 2024

నీట్ యుజి వివాదంపై రేపు సుప్రీం విచారణ

- Advertisement -
- Advertisement -

అవకతవకల ఆరోపణలతో పలు పిటిషన్లు
తిరిగి పరీక్ష కోసం మరో పిటిషన్
న్యూఢిల్లీ : నీట్ యుజి 2024 వైద్య ప్రవేశ పరీక్ష వివాదానికి సంబంధించిన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరుపుతుంది. మే 5న నిర్వహించిన పరీక్షలో అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో కూడిన పిటిషన్లు, తిరిగి పరీక్ష నిర్వహణకు ఆదేశించాలని కోరుతున్న పిటిషన్ వాటిలో ఉన్నాయి. పరీక్ష విశ్వసనీయతకు పెద్ద ఎత్తున భంగం కలిగిందనేందుకు దాఖలా ఏమీ లేని నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేయడం ‘బెడిసికొడుతుందని’, లక్షలాది నిజాయతీ అభ్యర్థుల అవకాశాలను ‘తీవ్రంగా దెబ్బ తీస్తుందని’ కేంద్రం, నీట్ యుజి నిర్వహించే ఎన్‌టిఎ ఇటీవల సుప్రీం కోర్టుకు స్పష్టం చేశాయి.

కోర్లు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన సోమవారం విచారణకుచేపట్టే పిటిషన్ల జాబితా ప్రకారం, ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెడి పర్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం పరీక్షకు సంబంధించిన 38 పిటిషన్లను విచారించవలసి ఉన్నది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య విద్యా సంస్థల్లో ఎంబిబిఎస్, బిడిఎస్, ఆయుష్, ఇతర సంబంధిత కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం నీట్ యుజి పరీక్షను ఎన్‌టిఎ నిర్వహిస్తుంటుంది.

మే 5న నిర్వహించిన పరీక్షలో ప్రశ్న పత్రం లీక్‌ల నుంచి బోగస్ వ్యక్తుల హాజరు వంటి పలు అక్రమాల ఆరోపణలకు సంబంధించి మీడియా చర్చలు, విద్యార్థులు, రాజకీయ పార్టీల నిరసనల తాకిడిని ఎన్‌టిఎ, కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఎదుర్కొంటున్నాయి. పరీక్షను రద్దు చేయాలని, తిరిగి పరీక్ష నిర్వహించాలని, మొత్తం వ్యవహారంపై కోర్టు పర్యవేక్షిత దర్యాప్తు జరిపించాలని కోరుతున్న పిటిషన్లను వ్యతిరేకిస్తూ కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ, ఎన్‌టిఎ వేర్వేర అఫిడవిట్లు దాఖలు చేశాయి. వివిధ రాష్ట్రాల్లో నమోడైన కేసులను సిబిఐ చేపట్టిందని అవి తమ సమాధానాల్లో తెలియజేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News