Thursday, January 23, 2025

సిఫార్సుదారే లేనప్పుడు ఆర్టికల్ 370 పునరుద్ధరణ కుదిరేనా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లో ఎటువంటి నియుక్త కానిస్టూట్ అసెంబ్లీ లేనప్పుడు ఆర్టికల్ 370 పునరుద్ధరణ సిఫార్సు ఎవరు చేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్టికల్ 370 రద్దు వల్ల ఈ రాష్ట్రం మునుపటి స్వరూపం పోయింది, ప్రత్యేక ప్రతిపత్తి దెబ్బతిందని, ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ఆరంభం అయింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సారధ్యపు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రక్రియను చేపట్టింది. 2019 ఆగస్టు 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీనిపై ప్రధాన ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో దాడికి దిగాయి. అయితే దీని వల్ల ఈ ప్రాంతానికి ప్రయోజనాలు చేకూరాయనే ప్రశంసలు కూడా వచ్చాయి.ఆర్టికల్ 370 రద్దు కుదరదని, దీనిని తిరిగి పునరుద్ధరించాలని చెప్పడం సరే,

ఇందుకు అవసరం అయిన సిఫార్సును చేయాల్సింది అక్కడి అసెంబ్లీ,మరి అక్కడ ఎటువంటి అసెంబ్లీ లేనందున దీని కోసం ఎవరు సిఫార్సు చేస్తారు? అని ధర్మాసనం నిలదీసింది. అయినా రాజ్యాంగంలో ఆర్టికల్ 370ని కేవలం తాత్కాలిక ఏర్పాటుగా పేర్కొన్నారు. అయితే 1957లో కశ్మీర్ కానిస్టూట్ అసెంబ్లీ కాలపరిమితి ముగిసిన తరువాత ఇది శాశ్వత ప్రక్రియ అయిందని, అయితే ఆర్టికల్ 370 ని పరిశీలిస్తే దీనిని రాష్ట్రపతి అవసరం అయినప్పుడు తన అధికార విచక్షణ పరిధిలో బహిరంగ నోటిఫికేషన్ ద్వారా రద్దు చేయవచ్చునని పేర్కొని ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. ఒక వేళ ఇది మార్పులతో కానీ ఇంతకు ముందటిలాగా కానీ ఉండాలనుకుంటే తగు విధమైన అసెంబ్లీ ఏర్పాటు, సంంధిత అసెంబ్లీ సిఫార్సుఅవసరం అని పిటిషన్లను ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News