- Advertisement -
ఢిల్లీ: వివేకా మర్డర్ కేసులో సునీత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. అవినాశ్ ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ సునీత పిటిషన్ వేశారు. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. కేసు దర్యాప్తును ఎంపి అవినాష్ ప్రభావితం చేస్తారని సునీత లాయర్లు తెలిపారు. అవినాష్ ముందస్తు బెయిల్ రద్దుపై విచారణ వాయిదా పడింది. ప్రస్తుతం వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని సిబిఐ నిందితుడిగా పేర్కొనడంతో ఎ8గా చేర్చింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ను హైకోర్టు ఇచ్చిన విషయం తెలిసిందే. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావం పడుతుందని సిబిఐ హైకోర్టుకు విన్నవించింది.
Also Read: ముక్కలు చేశాడు.. కుక్కర్‌లో ఉడికించాడు!
- Advertisement -