Monday, December 23, 2024

బీహార్లో కులాల సర్వేపై సుప్రీంకోర్టు విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బీహార్‌లో కుల గణన నిర్వహించాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను జనవరి 20న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహాలతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ మేరకు ప్రకటించింది. పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది ధర్మాసనం ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించగా నెల 20వ తేదీ శుక్రవారం పరిశీలించనున్నట్లు ధర్మాసనం తెలిపింది. జనవరి 7న బిహార్లో కులగణన మొదలవగా దీన్ని వ్యతిరేకిస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన రెండో పిటిషన్ ఇది.

ఈ పిటిషన్ కంటే ముందు న్యాయవాది బరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. బీహార్లో కులాల సర్వేను అధికారులు నిలిపివేయాలని, రాష్ట్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని పిల్‌లో కోరారు. జన గణన అంశం రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లోని జాబితా ఒకటిలో ఉందని, దానిని నిర్వహించే అధికారి కేంద్రానికి మాత్రమే ఉందని పిటిషనర్ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ప్రభుత్వం ఉల్లంఘించి నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News