లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లఖీంపూర్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభించారు. సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉత్తర్ ప్రదేశ ప్రభుత్వం తరుపున హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. గత విచారణలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంపై, ఘటనపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఘటనకు పాల్పిడిన వారిన ఎంత మందిని అరెస్టు చేసిందని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. బుధవారం ఘటనకు సంబందించిన దర్యాప్తును సీల్డు కవర్ లో కోర్టుకు హరిష్ సాల్వే సమర్పించారు. ఈ సందర్బంగా హరిష్ సాల్వేపై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ఎంత మందిని అరెస్టు చేశారని సిజెఐ ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబందించి నలుగురిని అరెస్టు చేశామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఘటనకు సంబందించి ఇంకా వీడియోలు ఉన్నాయని, అవి దర్యాప్తుకు పనికి వస్తాయని హరీష్ సాల్వే పేర్కొన్నారు. తాము సీల్డు కవర్ లో సమర్పించమని కోరలేదన్న జస్టిస్ సూర్యాకాంత్ తెలిపారు. గత రాత్రి 1 గంట వరకు వేచిచూశామని తమకు ఎలాంటి నివేదిక అందలేదన్న జస్టిస్ రమణ పేర్కొన్నారు. గురువారం లేదా శుక్రవారానికి వాయిదా వేయాలని హరీష్ సాల్వే కోరారు. విచారణ తిరిగి వచ్చే బుధవారానికి వాయిదా పడింది.
లఖీంపూర్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ….
- Advertisement -
- Advertisement -
- Advertisement -