Saturday, April 5, 2025

నీట్ సంస్కరణలపై మరో 2 వారాల గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నీట్ యుజి నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) పనితీరును సమీక్షించిన తర్వాత తీసుకురావలసిన సంస్కరణలపై నివేదిక రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీ తన నివేదికను దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును సుప్రీంకోర్టు సోమవారం మరో రెండు వారాలు పొడిగించింది. వివాదాలలో చిక్కుకున్న నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ అండర్‌గ్రాడ్యుయేట్(నీట్ యుజి) పరీక్షను మరింత పారదర్శకంగా, అవకతవకలకు ఆస్కారం లేకుండా నిర్వహించేందుకు ఎన్‌టిఎ పనితీరును సమీక్షించి పరీక్షా నిర్వహణలో తీసుకురావలసిన సంస్కరణలను రూపొందించేందుకు ఏర్పిన ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీ విస్తృతిని పొడిగిస్తూ ఆగస్టు 2న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

కేంద్రం తరఫున సోమవారం హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కమిటీ గడువు ముగుస్తున్నదని, నివేదిక సమర్పించేందుకు గడువును మరో రెండు వారాలు పొడిగించాలని కోర్టును చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరాఉ. కమిటీ నివేదిక తుది దశలో ఉన్నదని తెలుసుకున్న ధర్మాసనం నివేదికను దాఖలు చేసే గడువును రెండు వారాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News