Monday, January 20, 2025

రుషికొండ తవ్వకాల అంశంపై సుప్రీంలో విచారణ

- Advertisement -
- Advertisement -

Supreme Court hearing on Rushikonda excavations

న్యూఢిల్లీ: విశాఖ రుషికొండ తవ్వకాల అంశంపై బుధవారం సుప్రీం కోర్టు మరోసారి విచారణ చేపట్టింది. గతంలో రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వేరే ఎక్కడా ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వట్లేదని సుప్రీం స్పష్టం చేసింది. కొత్తగా తవ్విన ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. భావితరాలకు కాలుష్య రహిత వాతావరణం అందించాలని సూచించింది. హైకోర్టు తదుపరి ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిందేనని సుప్రీం వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News