Sunday, November 17, 2024

కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ పిటిషన్ల విచారణ

- Advertisement -
- Advertisement -

రాంచీ: తనపై నమోదైన మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నోటీసు జారీ చేసింది. ఈ కేసును కోర్టు వచ్చే వారం విచారించనుంది.

ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ రెండు పిటిషన్‌లు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం ముందు లిస్ట్ అయినట్లు లైవ్ లా నివేదించింది.

ఇప్పుడు రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ తన రిట్ పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 9 నాటి తీర్పును సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మార్చి 21న అరెస్టయినప్పటి నుండి కస్టడీలో ఉన్నారు.  ఈడీ  తన కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది, ఈ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ తన రీజయిండర్‌ను దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News