Wednesday, November 6, 2024

సిబిఐ ఆత్మ పరిశీలన చేసుకోవాలి: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

Supreme Court impatience on Performance of CBI

‘పంజరంలో చిలకకు స్వేచ్ఛ రావాలి’
కేసుల విచారణపై సిబిఐ ఆత్మ పరిశీలన చేసుకోవాలి
దర్యాప్తులో సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి
సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సిబిఐ పనితీరు పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సిబిఐ కేసులు కోర్టుల్లో నిలబడే పరిస్థితి లేదని వ్యాఖ్యానించింది. కేసుల విచారణపై దర్యాప్తు సంస్థ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికింది. సిబిఐ ఇప్పటికీ పంజరంలో చిలకలాగే వ్యవహరిస్తోందని, ఆ చిలకకు స్వేచ్ఛ కావాలంటూ గతంలో మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. ఆ చిలకకు స్వేచ్ఛ రావాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. షోపియాన్ జిల్లాలో ఇద్దరు మహిళలు హత్యకు గురైన ఘటనలో తప్పుడు సాక్ష్యాలు సృష్టించడంతో పాటు సాక్షులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై జమ్మూకశ్మీర్‌కు చెందిన ఇద్దరు న్యాయవాదుల అరెస్టుకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సిబిఐ నమోదు చేసే కేసుల్లో విజయాల శాతం తక్కువగా ఉందన్న అభిప్రాయం నెలకొంది. ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టారు. వాటిల్లో ఎన్ని నిరూపించారు. ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి అని ధర్మాసనం ప్రశ్నించింది. అంతేగాక సిబిఐ దర్యాప్తులో సమస్యలను తమ దృష్టికి తేవాలని కోర్టు సూచించింది. సిబ్బంది, వసతుల లేమి ఉంటే చెప్పాలని ఆదేశించింది. దీనిపై ఆరు వారాల్లోగా సమాధానం చెప్పాలని సిబిఐ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.

Supreme Court impatience on Performance of CBI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News