ఢిల్లీ: హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అత్యవసర విచారణ కు స్వీకరించాలని సిజెఐ బెంచ్ ను సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. గురువారం విచారిస్తామని సిజెఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లో పివొపి విగ్రహాల నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆంక్షలు విధించడంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా హుస్సేన్ సాగర్‌లో గణేశ్, దుర్గాదేవి విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.
వినాయక విగ్రహాల నిమజ్జనంపై రేపు సుప్రీంలో విచారణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -