Wednesday, November 13, 2024

సత్యేంద్ర జైన్‌కు సుప్రీం మధ్యంతర బెయిల్

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ఆప్ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు సుప్రీంకోర్టు అనారోగ్య కారణాలపై శుక్రవారం మధ్యంతర బెయిల్ ంజూరు చేసింది. తీహార్ జైలులోని వాష్‌రూములో కళ్లు తిరిగి కుప్పకూలిన సత్యేంద్ర జైన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  మధ్యంతర బెయిల్ కాలంలో మీడియాతో మాట్లాడకూడదని సత్యేంద్ర జైన్‌కు సుప్రీంకోర్టు షరతు విధించింది.

Also Read: మురికివాడ నుంచి మోడల్‌గా ఎదిగిన చిన్నారి

తనకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడానికి జైన్‌కు అనుమతిచ్చిన సుప్రీంకోర్టు చికిత్స అనంతరం వైద్య రికార్డులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తీహార్ జైలులోని వాష్‌రూములో కళ్లు తిరిగి కిందపడిన సత్యేంద్ర జైన్‌కు వెన్నెముక వద్ద గాయమైంది. ఆయనను గురువారం దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్న సత్యేంద్ర జైన్‌ను లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News