Friday, December 20, 2024

ఆ వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోండి

- Advertisement -
- Advertisement -

Supreme Court Issues Notice to Centre

పిటిషన్‌పై కేంద్రం, ఇసికి ”సుప్రీం” నోటీసులు

న్యూఢిల్లీ: తీవ్రమైన నేరారోపణలపై విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీచేసింది. జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర న్యాయ శాఖ, హోం శాఖ, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీచేస్తూ దీనికి సమాధానం ఇవ్వాలని కోరింది. సీనియర్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ నోటీసులు జారీచేసింది. క్రిమినల్ కేసులు నమోదైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించడంతోపాటు తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులలో విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తులను కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని కేంద్రాన్ని, ఎన్నికల కమిషన్‌ను పిటిషనర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News