Thursday, January 23, 2025

రాహుల్ పరువునష్టం కేసు: పూర్ణేష్ మోడీకి సుప్రీం నోటీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మోడీ ఇంటిపేరుకు సంబంధించిన పరువునష్టం కేసులో జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ దాఖలు వేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌పై గుజరాత్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీకి, గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది.
2019 ఏప్రిల్ 13న కర్నాటకలోని కోలార్‌లో ఒక ఎన్నికల సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది అంటూ చేసిన వ్యాఖ్యలపై పూర్ణేష్ మోడీ పరువునష్టం కేసు దాఖలు చేయగా ఈ కేసుపై సూరత్ కోర్టు ఇటీవల తీర్పు వెలువరిస్తూ రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ తీర్పుపై స్టే కోరుతూ రాహుల్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది.

చివరగా ఆయన సుప్రీంకోర్టులో స్టే కోరుతూ పిటిషన్ దాఖలు చేయడగా దీనిపై సమాధానాలు కోరుతూ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పికె మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం పూర్ణేష్ మోడీకి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. శిక్షను నిలుపుదల చేయగలమా లేదా అన్నదే ఇప్పుడు మౌలిక ప్రశ్న అని, దీనికే పరిమితం అవుదామని ధర్మాసనం అభిప్రాయపడింది. రాహుల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ రాహుల్ గాంధీ ఇప్పటికే 111 రోజులు నష్టపోయారని, ఒక పార్లమెంట్ సమావేశాలను కోల్పోవడంతోపాటు మరో సమావేశాలను కోల్పోతున్నారని అన్నారు. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 4వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News