Thursday, January 23, 2025

ఓబుళాపురం మైనింగ్ కేసు..ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీం నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఓబుళాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఎఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఓబుళాపురం మైనింగ్ కేసుకు సంబంధించి గతంలో తెలంగాణ హైకోర్టు శ్రీలకి క్లీన్ చిట్ ఇవ్వడంపై సిబిఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయిం చారు. ఇందుకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం.. శ్రీలక్ష్మికి నోటీసులు జారీ చేసింది. 1988 బ్యాచ్ ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి. అనంతపురం జిల్లా ఓబుళాపురం, మలపనగుడి గ్రామాల్లోని బళ్లారి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోని ఓఎంసీకి మైనింగ్ లీజుల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్, అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 2009 డిసెంబర్ 7న సిబిఐ ఒఎంసిపై కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి శ్రీలక్ష్మి పాత్రపై దర్యాప్తు చేసిన సిబిఐ 2012 మార్చి 30న ఆమెపై చార్జిషీట్ దాఖలు చేసింది. 2007 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో శ్రీలక్ష్మి తన కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.

ఒఎంసికి అనుకూలం గా అక్రమ మైనింగ్ లైసెన్సులను మంజూరు చేసేందుకు కుట్ర పన్నడం ద్వారా ఆమె తనకు లభించిన అధికారాలను దుర్వినియోగం చేసిందని అభియోగం మోపింది. అనంతపురంలో మైనింగ్ లీజులు మంజూరు చేయడంలో ఒఎంసి ప్రమోటర్, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్‌రెడ్డితో ఆమె కుమ్మక్కె ైనట్లు సిబిఐ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి 2011 నవంబర్ 28న సిబిఐ ఆమెను అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. ఇక, 2012 అక్టోబర్‌లో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి గతంలో శ్రీలక్ష్మి డిశ్చార్జి పిటిషన్లను హైకోర్టు రెండుసార్లు కొట్టివేసింది. 2021లో సెప్టెంబరులో ఆమె విచారణను ప్రారంభించడానికి సిబిఐ కోర్టుకు స్వేచ్ఛ ఉందని తీర్పు వెలువరిం చింది. ఇక, ఈ కేసును కొట్టివేయాలని ఆమె వేసిన పిటిషన్‌ను సిబిఐ కోర్టు కొట్టివేసింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆమెపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ గతేడాది నవంబర్ 8న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News