Sunday, April 6, 2025

రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని.. పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కెటిఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు వేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్‌ ధర్మాసనం విచారణ చేపట్టి.. తెలంగాణ ప్రభుత్వానికి, అసెంబ్లీ సెక్రటరీకి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

విచారణలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి బిఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ నిర్ణయం తీసుకొనేందకు రీజనబుల్ టైం కావాలి అనడం అంటే ఏంటని ఆయన ప్రశ్నించారు. రీజనబుల్ టైం కావాలి అంటే అది గడువు ముగిసే వరకా? అని మండిపడ్డారు. ఎంత సమయం కావాలో స్పష్టంగా చెప్పాలని ఆయన అన్నారు. ఇక బిఆర్‌ఎస్ తరఫున అర్యమ సుందరం వాదనలు వినిపించారు. పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆయన అన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం అంటే.. రాజ్యంగం ఇచ్చిన విధులను నిర్వహించడంలో విఫలమైనట్లే అని పేర్కొన్నారు. వాదోపవాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 25వ తేదీకి వాయిదా వేసింది. ఈ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News