Monday, January 27, 2025

నేడు పెద్ద నోట్ల రద్దు పై సుప్రీం తీర్పు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో పెద్ద నోట్ల రద్దు అంశంపై సుప్రీంకోర్టు నేడు (సోమవారం) తన తీర్పు వెలువరిస్తుంది. 2016 సంవత్సరం లో మోడీ ప్రభుత్వం ఉన్నట్లుండ రూ 1000, రూ 500 నోట్లను రద్దు చేసింది. దీని వల్ల తలెత్తిన విపరీత సామాజిక ప్రభావం ఇ తర విషయాలను ప్రస్తావిస్తూ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దా ఖలు అయిన పలు పిటిషన్లపై ఇప్పుడు న్యాయమూర్తి ఎస్‌ఎ న జీర్ నాయకత్వపు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీ ర్పు వెలువరిస్తుంది. శీతాకాల సెలవుల విరామం తరువాత సు ప్రీంకోర్టు సోమవారం తిరిగి ప్రారంభమవుతుంది. జస్టిస్ నజీర్ ఈ నెల 4వ తేదీనే రిటైర్ కానున్నారు. దీనితో ఆయన సోమవా రం తీర్పు వెలువరించి సెలవు తీసుకుంటారని వెల్లడైంది. సోమవారం నాటి కోర్టు దైనందిన కార్యక్రమాల జాబితా మేరకు ఈ పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి రెండు వేర్వేరు తీర్పులు ఉంటాయని వెల్లడైంది. నజీర్ కాకుండా ఈ ధర్మాసనంలో గవాయ్, నాగరత్న, ఎఎస్ బొపన్న, వి రామసుబ్రమణియన్‌లు సభ్యులు గా ఉన్నారు.

సోమవారం వెలువడే రెండు తీర్పులు భిన్నాభిప్రాయాలతో ఉంటాయా? లేక ఏకాభిప్రాయంతోనే ఉంటాయా? అనేది న్యాయస్థానంలోనే స్పష్టం అవుతుంది. కోర్టు పలు దఫా ల విచారణ తరువాత నోట్ల రద్దు వ్యవహారం నిర్ణయాలపై తమ వైఖరిని స్పష్టం చేయాలని డిసెంబర్ 7వ తేదీన అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి, ఆర్‌బిఐకి నోటీసులు వెలువరించింది. సంబంధింత రికార్డులను తమ ముందు ఉంచాలని పేర్కొంటూ తీర్పును అప్పట్లోనే రిజర్వ్ చేసి ఉంచింది. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ పూర్తిగా లోపాలతో ఉందని , అనాలోచిత నిర్ణయానికి మోడీ ప్రభుత్వం సొంతంగా దిగినట్లుగా ఆధారాలు ఉన్నాయని ఈ వ్యవహారంపై విచారణల దశలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులలో ఒక్కరైన పి చిదంబరం పేర్కొన్నారు. శ్యామ్ దివాన్ కూడా పిటిషనర్ల తరఫున వాదించారు. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, ఆర్‌బిఐ తరఫు న్యాయవాదులు తమ వివరణలు తెలిపారు.

మోడీ తనకు తానుగా తీసుకున్నారని చెపుతోన్న పెద్ద నోట్ల రద్దు సముచితమేనా? లేక ఇది విపరీత పరిణామమా? అనేది తేల్చే కీలక తీర్పు వెలువడటం సోమవారం నాటి విశేష పరిణామం అయింది. నవంబర్ 8, 2016 రాత్రి తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై సవాలు చేస్తూ ఏకంగా 58 పిటిషన్లు దాఖలు అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News