- Advertisement -
హైదరాబాద్ : విద్య, ఉద్యోగాల్లో ఒబిసిలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి వినతులు వస్తున్నాయని, అయితే అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి ప్రతిమా భౌమిక్ తెలిపారు. రాజ్యసభ లో వైసిపి సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు కలిపి కేంద్ర ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందని, అందులో 27% ఒబిసిలకు కల్పిస్తోందని పేర్కొన్నారు. అందువల్ల విద్య, ఉద్యోగాల్లో వీరి రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచే ప్రతిపాదన లేదన్నారు.
- Advertisement -