ముంబై: మరాఠా రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. మహారాష్ట్రలోని మరాఠా సంఘం రిజర్వేషన్లు రాజ్యంగ విరుద్ధమని సుప్రీం తేల్చిచెప్పింది. రిజర్వేషన్ల నిర్ణయంలో 50శాతం పరిమితిని ఉల్లంఘించారని స్పష్టం చేసింది. 50శాతం రిజర్వేషన్ పరిమితి నిర్ణయంపై పున:పరిశీలన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. ఆర్థిక,సామజిక వెనుకబాటుతనం ఆధారంగానే రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది. పిజి మెడికల్ కోర్సుల్లో మునుపటి ప్రవేశాలు కొనసాగుతాయన్నారు. గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. గతేడాది మరాఠాలకు ఉద్యోగాల్లో 12శాతం కోటాను మహారాష్ట్ర సర్కార్ కల్పించింది. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై వివిధ రాష్ట్రాల అభిప్రాయాలు కోర్టు కోరింది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై గత తీర్పును సమీక్షించాలని సుప్రీంకోర్టును మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రిజర్వేషన్లు 50శాతానికి మించరాదని 1992లో ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీం తీర్పునిచ్చింది.
Supreme Court judgment on Maratha reservation