Thursday, January 23, 2025

నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు!

- Advertisement -
- Advertisement -
ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ముర్మును పక్కన పెట్టినందుకు దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి.

న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని మే 28న ప్రధాని నరేంద్ర మోడీతో కాక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభింపజేయాలని కోరతూ ప్రతిపక్ష పార్టీలు పెట్టుకున్న వినతిని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో వివాదం చోటుచేసుకోవడంతో సుప్రీంకోర్టు లాయర్ ఒకరు ఈ పిటిషన్ వేశారు. కాగా మే 28న నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోడీయే ఆవిష్కరించబోతున్నారు. దీనిని 20 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరిస్తున్నాయి. 19 ప్రతిపక్ష పార్టీలు బుధవారం విడుదలచేసిన సంయుక్త ప్రకటనలో ‘ఎప్పుడైతే ప్రజాస్వామ్యం ఆత్మను పార్లమెంటు నుంచి పీల్చేసుకున్నారో, ఇక నూతన భవనానికి విలువలేదని మేము అనుకుంటున్నాము’ అని తెలిపారు. కాగా ఈ ధిక్కార నిర్ణయాన్ని బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ విమర్శించింది.

మే 18న లోక్‌సభ సచివాలయం విడుదల చేసిన ప్రకటన, కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి సంబంధించి లోక్‌సభ సెక్రటరీ జనరల్ జారీ చేసిన ఆహ్వానం రాజ్యాంగ ఉల్లంగనేనని న్యాయవాది జయ సుకిన్ దాఖలు చేసిన పిల్ పేర్కొంది.
లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకుని నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభిచాలని ఆహ్వానించారు. మోడీ ఈ నూతన భవనానికి 2020లో శంకుస్థాపన కూడా చేశారు. అప్పుడు కూడా ప్రతిపక్షాలు ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News